Andhra Medical College Jobs Notification 2025
పదవ తరగతి మరియు డిగ్రీ అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు:
Andhra Medical College Jobs Notification 2025
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి 22 కేడర్లలో 71 పోస్టుల నియామకానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 71 పోస్టులకు అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వబడతాయి, కాబట్టి ఈ కథనాన్ని పూర్తిగా చదివి మీరు అర్హులైతే జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోండి.
మొత్తం పోస్టుల సంఖ్య మరియు వాటి వివరాలు:
ఆంధ్ర మెడికల్ కాలేజీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి మరియు వాటి వివరాలు క్రింద క్లుప్తంగా ఇవ్వబడ్డాయి.
1.రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ – 1 పోస్టు
మెడికల్ ఫిజిసిస్ట్ – 2 పోస్టుల
రేడియోథెరపీ టెక్నీషియన్ – 2 పోస్టులు
మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ – 1 పోస్టు
అనస్తీషియా టెక్నీషియన్ – 6 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్
అసిస్టెంట్ – 3 పోస్టులు
రెసెప్షనిస్ట్ నిస్ట్ – 1 పోస్టు
జనరల్ డ్యూటీ అటెండెంట్ – 21 పోస్టులు
ఆఫీస్ సబార్డినేట్ – 4 పోస్టులు
టైపిస్టు/డేటా ఎంట్రీ ఆపరేటర్ – 1 పోస్టు
హాస్టల్ వార్డెన్లు (మహిళలు) – 3 పోస్టులు
లైబ్రరీ అటెండెంట్ – 2 పోస్టులు
క్లాస్ రూమ్ అటెండెంట్ – 1 పోస్టు
ప్రోసైటిక్ & ఆర్థో టెక్నీషియన్ – 5 పోస్టులు
వంటవాళ్లు (కుక్స్) – 4 పోస్టులు
అంబులెన్స్ డ్రైవర్లు – 3 పోస్టులు
హాస్టల్ అటెండెంట్ (మహిళలు) – 3 పోస్టులు
C-Arm టెక్నీషియన్ – 1 పోస్టు
EEG టెక్నీషియన్ – 1 పోస్టు
స్పీచ్ థెరపిస్ట్ – 2 పోస్టులు
OT టెక్నీషియన్ – 2 పోస్టులు
OT అసిస్టెంట్- 2 పోస్టులు
జీతాల వివరాలు:
Andhra Medical College Jobs Notification 2025 ఈ నోటిఫికేషన్ ప్రకారం ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో విధంగా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది వాటి గురించి పూర్తిగా కింద ఇవ్వడం జరిగింది.
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ – 61,960/-
మెడికల్ ఫిజిసిస్ట్ – 61,960/-
రేడియోథెరపీ టెక్నీషియన్ – 32,670/-
మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ – 32,670/-
అనస్తీషియా టెక్నీషియన్ – 32,670/-
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ລໍ – 18,500/-
రెసెప్షనిస్ట్ – 18,500/-
జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-
ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-
టైపిస్టు/డేటా ఎంట్రీ/కంప్యూటర్ ఆపరేటర్ -18,500/-
హాస్టల్ వార్డెన్ (మహిళలు) – ₹18,500/-
లైబ్రరీ అటెండెంట్ – 15,000/-
క్లాస్ రూమ్ అటెండెంట్ – 15,000/-
* ప్రోసైటిక్ & ఆర్థో టెక్నీషియన్ – 21,500/-
వంటవాళ్లు (కుక్స్) – 15,000/-
అంబులెన్స్ డ్రైవర్లు – 23,780/-
హాస్టల్ అటెండెంట్ (మహిళలు) – 15,000/-
C-Arm టెక్నీషియన్ – 32,670/-
EEG టెక్నీషియన్ – 32,670/-
స్పీచ్ థెరపిస్ట్ – 40,970/-
OT టెక్నీషియన్ – 32,670/-
OT అసిస్టెంట్ – 15,000/-
ముఖ్యమైన తేదీలు:
ఆంధ్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబాల సంక్షేమ శాఖ వారు ఈ నోటిఫికేషన్ 26 జూలై నెల 2025 నా విడుదల చేశారు అంటే 26/07/2025 నుండి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు మరియు మూడవ తేదీ ఆగస్టు నెల 2025 అంటే (03/08/2025) తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ( చివరి తేదీ). కనుక అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగానే మేల్కొని చివరి తేదీలోపు అప్లై చేసుకోవాలి.
అభ్యర్థి యొక్క వయసు మరియు ఇతర వివరాలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 42 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి అలా అయితేనే ఈ ఉద్యోగాలకు అర్హులు మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలేషన్ అనేది వర్తిస్తుంది అనగా ఎస్సీ, ఎస్టీ ,బీసీలు కు ఐదేళ్లు వయసు మినహాయింపు లభిస్తుంది మరియు పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయసు సదలింపు లభిస్తుంది.
అప్లై చేయు విధానము మరియు ఫీజు వివరాలు:
ముందుగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ను జిరాక్స్ చేయించుకుని అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసిన తర్వాత ఓసి అభ్యర్థులు అయితే 500 రూపాయలు మరియు ఎస్సీ, ఎస్టీ బీసీ ఇతర అభ్యర్థులు అయితే 350 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. పూర్తి చేసిన అప్లికేషన్ మరియు అప్లికేషన్ ఫీజు పట్టుకుని కావాల్సిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతపరిచి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ విభాగంలో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. దీనికి ఎటువంటి ఆన్లైన్ అనేది వర్తించదు కేవలం స్వయంగా వెళ్లి మీ అప్లికేషన్ పేపర్ ను అడ్మిన్ విభాగంలో ఇవ్వవలసి వస్తుంది కనుక ఇది గమనించండి.
✅ Download Notification & Application
Instagram : Click Here