Apsrtc Recruitment 2024 Apply Online

APSRTC అప్రెంటిస్ నోటిఫికేషన్ 2024, (606) ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | APSRTC Notification For 606 Posts.

Apsrtc Recruitment 2024 Apply Online

ఐటిఐ పాస్ అయిన వారికి ఏపీఎస్ఆర్టీసీ నుండి శుభవార్త:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ (APSRTC) వాళ్లు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో (APSRTC) అప్రెంటిస్ చేయాలనుకునే ఐటిఐ పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు.
ఈ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ కి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ అనేది ఎలా చేస్తారు, శాలరీ ఎంత ఉంటుంది మరియు ఏ జిల్లా వారు అప్లై చేసుకోవడానికి అర్హులు మరియు జిల్లా వారీగా ఖాళీలు పోస్ట్ ల పేర్లు మరియు వాటి వివరాలు క్లుప్తంగా కింద ఇవ్వడం జరిగింది చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి.

Apsrtc Recruitment 2024 Apply Online:

నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కంపెనీ పేరు మరియు వివరాలు:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ (APSRTC) కంపెనీ వారు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ కంపెనీ అందరికీ సుపరిచితమైన ది. చాలామంది ఈ కంపెనీలో చేరడానికి ఇష్టపడతారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లాల నందు ఉన్న ఐటిఐ ల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ అప్రెంటిస్కు అర్హులు.

Apsrtc Recruitment 2024 Apply Online Number of vacancies and their details:

ఖాళీల సంఖ్య మరియు వాటి వివరాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల రవాణా శాఖ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం
1. కర్నూలు జిల్లా : డీజిల్ మెకానిక్ -35 , మోటార్ మెకానిక్ – 4, ఎలక్ట్రీషియన్- 4, వెల్డర్- 1, పెయింటర్- 1 మిషనిస్ట్- 0, ఫిట్టర్-1, మరియు డ్రాఫ్ట్ మెన్స్ సివిల్- 1 ఇలా మొత్తం కలిపి కర్నూలు జిల్లాలో 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

2. నంద్యాల జిల్లా: డీజిల్ మెకానిక్ -34 , మోటార్ మెకానిక్ – 4, ఎలక్ట్రీషియన్- 4, వెల్డర్- 1, పెయింటర్- 1 మిషనిస్ట్- 0, ఫిట్టర్-0, మరియు డ్రాఫ్ట్ మెన్స్ సివిల్- 1 ఇలా మొత్తం కలిపి నంద్యాల జిల్లాలో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

3. అనంతపురం జిల్లా: డీజిల్ మెకానిక్ -38 , మోటార్ మెకానిక్ – 5, ఎలక్ట్రీషియన్- 5, వెల్డర్- 2, పెయింటర్- 1 మిషనిస్ట్- 0, ఫిట్టర్-1, మరియు డ్రాఫ్ట్ మెన్స్ సివిల్- 1 ఇలా మొత్తం కలిపి 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

4. శ్రీ సత్య సాయి జిల్లా: డీజిల్ మెకానిక్ -28 , మోటార్ మెకానిక్ – 3, ఎలక్ట్రీషియన్- 3, వెల్డర్- 1, పెయింటర్- 1, మిషనిస్ట్- 0, ఫిట్టర్-0, మరియు డ్రాఫ్ట్ మెన్స్ సివిల్- 1 ఇలా మొత్తం కలిపి 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

5.కడప జిల్లా: డీజిల్ మెకానిక్ -40 , మోటార్ మెకానిక్ – 9, ఎలక్ట్రీషియన్- 5, వెల్డర్- 1, పెయింటర్- 1 మిషనిస్ట్- 5, ఫిట్టర్-3, మరియు డ్రాఫ్ట్ మెన్స్ సివిల్- 1 ఇలా మొత్తం కలిపి 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Andhra Medical College Jobs Notification 2025
Andhra Medical College Jobs Notification 2025

6. అన్నమయ్య జిల్లా: డీజిల్ మెకానిక్ -36 , మోటార్ మెకానిక్ – 5, ఎలక్ట్రీషియన్- 4, వెల్డర్- 1, పెయింటర్- 1 మిషనిస్ట్- 0, ఫిట్టర్-0, మరియు డ్రాఫ్ట్ మెన్స్ సివిల్- 1 ఇలా మొత్తం కలిపి 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Apsrtc Recruitment 2024 Apply Online Number of vacancies, details Table:
ట్రేడ్/ జిల్లా డిజిటల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ మెషనిస్ట్ ఫిట్టర్ డ్రాప్ట్స్ మెన్ సివిల్ మొత్తము
కర్నూల్ 35 4 4 1 1 0 1 1 47
నంద్యాల 34 4 4 1 1 0 0 1 45
అనంతపురం 38 5 5 2 1 0 1 1 53
శ్రీ సత్య సాయి 28 3 3 1 1 0 0 1 37
కడప 40 9 5 1 1 5 3 1 65
అన్నమయ్య 36 5 4 1 1 0 0 1 48
గమనిక:

కడప జిల్లాలో అత్యధికంగా 65 కాళీ పోస్టులు మరియు శ్రీ సత్య సాయి జిల్లాలో తక్కువగా 37 ఖాళీ పోస్టులు ఉన్నాయి .

ఎలా అప్లై చేసుకోవాలి:

ఐటిఐ పాసైన విద్యార్థులు వారి పూర్తి వివరములతో ఆన్లైన్ లో ప్రొవైడ్ చేసిన లింకింగ్ క్లిక్ చేసి వారు అప్రెంటిస్ చేయాలనుకుంటున్నా ట్రేడ్ మరియు జిల్లాను క్లిక్ చేస్తే అక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత తగిన డీటెయిల్స్ అవన్నీ పూర్తి చేసి ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవాలి.

ఫీజు మరియు సెలక్షన్ ప్రాసెస్:

ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీయొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకుని జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల బళ్ళారి చౌరస్తా కర్నూల్ నందు ఈ సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని వెళ్ళవలసి వస్తుంది వెరిఫికేషన్ కోసం హాజరయ్యే విద్యార్థులు 118 రూపాయలు చెల్లించవలసి వస్తుంది ఈ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది వీళ్లు పేపర్ ద్వారా ప్రకటన అనేది ఇస్తారు కనుక ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు పేపర్ ప్రకటన అనేది గమనిస్తూ ఉండాలి.

ముఖ్యమైన పత్రాలు:

Apsrtc Recruitment 2024 Apply Online వెరిఫికేషన్కు వెళ్లేటప్పుడు అభ్యర్థులు తమతో పాటు తీసుకు వెళ్లాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు కింద ఇవ్వడం జరిగింది..
1. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్
2. దరఖాస్తు చేసుకున్నాక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది హాయ్ రిజిస్ట్రేషన్ నంబర్ను మీ దగ్గర ఉండవలెను.
3. టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్
4. ఐటిఐ మార్క్స్
5. NCVT సర్టిఫికెట్ ( ముఖ్యమైనది)
6. క్యాస్ట్ సర్టిఫికెట్ ( పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే 6 నెలల్లోపు జారీ చేసిన టెంపరరీ క్యాష్ సర్టిఫికెట్ను తీసుకువెళ్లొచ్చు)
7. ఆధార్ కార్డ్.

Apsrtc Recruitment 2024 Apply Online Things to note:

గుర్తించుకోవలసిన విషయాలు:

1. ఆన్లైన్లో నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం వెళ్ళవలెను.
2. పోర్టల్ నందు అప్రెంటిస్ కొరకు అప్లై చేయునప్పుడు ఏమైనా సందేహాలు మరియు ఎటువంటి మిస్టేక్స్ వచ్చినా మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ లో వెళ్లి వారి సహాయం తీసుకోవచ్చును.
3. అభ్యర్థి యొక్క ఆధార్ కార్డ్ కేవైసీ కంప్లీట్ చేసుకోవలెను.
4. అభ్యర్థి యొక్క ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మరియు ఎస్ఎస్సి సర్టిఫికెట్ లో ఉన్న డీటెయిల్స్ రెండు మ్యాచ్ అవ్వాలి.

ఈ రిక్రూట్మెంట్ లో ఉన్న ఉద్యోగ అవకాశాలు తరగొచ్చు లేదా తిరగవచ్చు అప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది దానిని గమనించగలరు. అభ్యర్థులు పూర్తి వివరాలకు Click Here వెబ్‌సైట్‌ చూడొచ్చు.

AAI Apprentice Recruitment 2024
AAI Apprentice Recruitment 2024
జీతాల వివరాలు:

ఇది అప్రెంటిస్ జాబ్ కాబట్టి వాళ్లని ఇవాళ ప్రకారం మీరు ఎంచుకున్న ట్రేడ్ ప్రకారం స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనిని అభ్యర్థులు గమనించవలెను.

Official Notification PDF: Click Here

అధికారిక వెబ్ సైట్ : https://www.apsrtc.ap.gov.in/Recruitments.php

దరఖాస్తు లింక్ : Click Here

మరిన్ని చూడండి.

Leave a Comment